ఉపాధి బకాయిలు వెంటనే చెల్లించాలి: ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: దేవరాపల్లి

అనకాపల్లి జిల్లాలో పెండింగ్లో ఉన్న రూ.110.53 కోట్ల ఉపాధి హామీ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న డిమాండ్ చేశారు. జిల్లాలోని 22 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, పనులు దొరకక 2,44,823 మంది కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు తక్షణమే చెల్లించకపోతే జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు, నిరసన ఉద్యమాలు చేపడతామని ఆయన స్పష్టంగా హెచ్చరించారు.