శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో విజయవాడ నుంచి పలాస వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో టైర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జమ్మూ జంక్షన్ వద్ద ఈ ప్రమాదం జరగగా, అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఈ ఘటనతో ఆ మార్గంలో కొద్దిసేపు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.