వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తపై పాశవిక దాడి
రిపోర్టర్: విజయ్
స్థలం: వినుకొండ
పల్నాడు జిల్లా వినుకొండలో కూటమి ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నాడనే అక్కసుతో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త గణపతిపై పాశవిక దాడి జరిగింది. పొలానికి వెళ్తున్న సమయంలో కారులో వచ్చి ఆయనను కిడ్నాప్ చేసి ఈ దాడికి పాల్పడ్డారు. ఈ అరాచకానికి కానిస్టేబుల్ అశోక్ సహకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తీవ్ర గాయాలతో బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.