అయోధ్యలో అంగరంగ వైభవంగా పదవ దీపోత్సవం: ముప్ పై లక్షల దీపాలతో వెలిగిన సరయూ తీరం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అయోధ్య
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య నగరంలో పదవ దీపోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. సరయూ నదీ తీరాన ఉన్న యాభై ఆరు ఘాట్లలో ముప్ పై లక్షలకు పైగా మట్టి ప్రమిదలను వెలిగించి దీపోత్సవం చేపట్టారు. ఈ చరిత్రాత్మక వేడుకల్లో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తో పాటు గవర్నర్ ఆనందిబెన్ పటేల్, దేశవ్యాప్తంగా వచ్చిన పలువురు ప్రముఖులు, సాధువులు ఉత్సాహంగా పాల్గొన్నారు.