అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీ మొదటి వార్డులో నవదుర్గ ఉత్సవాల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణలో పాల్గొని భక్తులకు స్వయంగా ప్రసాదం వడ్డించారు. బెల్లంపల్లి ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.