'ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పెద్దపీట': నెల్లూరులో హైస్కూల్ ప్రారంభించిన మంత్రి లోకేష్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Nellore
నెల్లూరు పట్టణంలోని స్టోన్ హౌస్ పేటలో ఆధునీకరించిన ఆర్ఎస్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌ను రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల అంతటా పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించి మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా తీశారు. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేసిన ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.