ఆదోనిలో సేవా సంకల్ప అభియాన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉత్సవాలు
రిపోర్టర్: KISHORE M
స్థలం: ఆదోని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాలను పురస్కరించుకొని ఆదోని పట్టణంలో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా అంగన్వాడీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి సూచన మేరకు, బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షులు తోవి నాగార్జున ఆధ్వర్యంలో కార్వాన్పేట ప్రాంతంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సేవలందిస్తున్న సిబ్బందిని ఘనంగా సత్కరించారు.