డ్రగ్స్ మహమ్మారిని కూకటివేళ్లతో పెకిలించాలి: వరంగల్ సీపీ శ్వేత సంచలన ఆదేశాలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హన్మకొండ
డ్రగ్స్ అక్రమ రవాణా మరియు విక్రయాలను పూర్తిగా అరికట్టాలని, మాదకద్రవ్యాల నెట్వర్క్లను సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా క్రైమ్ పార్టీ సిబ్బంది తమ సమాచార సేకరణ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఐపీఎస్ స్పష్టం చేశారు. డ్రగ్స్ మహమ్మారిని సమాజం నుంచి కూకటివేళ్లతో పెకిలించివేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే పోలీసు సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరించి కఠిన చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ (@warangalpolice) అధికారికంగా వెల్లడించారు.