సిద్దిపేట జిల్లా పదేళ్ల ప్రస్థానం: ప్రత్యేక వేడుకలను ప్రకటించిన తన్నీరు హరీష్ రావు
రిపోర్టర్: సురేష్
స్థలం: సిద్దిపేట
సిద్దిపేట జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు ప్రకటించారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా పదేళ్ల పండుగ ఘనంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన కోరారు. గత పదేళ్లలో సాధించిన అభివృద్ధిని ఈ వేడుకల ద్వారా ప్రజలకు వివరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.