మత్తుకు దూరంగా ఉంటూ ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని అనంతపురం పోలీసుల పిలుపు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అనంతపురం

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ తమ ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని అనంతపురం జిల్లా పోలీస్ యంత్రాంగం పిలుపునిచ్చింది. ఈ మేరకు మత్తు వలయాల్లో చిక్కుకుని యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరిస్తూ ఒక ప్రత్యేక అవగాహన సందేశాన్ని విడుదల చేశారు. మత్తు కాదు మీ భవిష్యత్తే ముఖ్యమని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు స్పష్టం చేశారు. యువత చెడు అలవాట్లకు బానిసలై జీవితాన్ని వృథా చేసుకోవద్దని, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని పోలీసులు హితవు పలికారు.