ఇకపై ఆచితూచి మాట్లాడుతానని స్పష్టం చేసిన ప్రముఖ నటి సాయిపల్లవి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
తన మాట్లాడే శైలిపై వస్తున్న విమర్శల నేపథ్యంలో నటి సాయిపల్లవి కీలక వ్యాఖ్యలు చేశారు. మనసులోని భావాలను స్పష్టంగా వ్యక్తీకరించడంలో తప్పులు జరుగుతున్నాయని, అందుకే ఇకపై ఆచితూచి మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తాను ఏం మాట్లాడినా విస్తృత ప్రచారం లభిస్తుందని, అందుకే సరిగ్గా మాట్లాడే నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి పేర్కొన్నారు. పలు సందర్భాల్ లో తన మాటలు వివాదాలకు దారితీసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె పరోక్షంగా అంగీకరించారు.