పాలకొల్లులో అన్న కాంటీన్ వద్ద ఉచిత భోజన ఏర్పాట్లు: మంత్రి నిమ్మల కృతజ్ఞతలు
రిపోర్టర్: నరేష్
స్థలం: పశ్చిమ గోదావరి
ప్రభుత్వ ఆసుపత్రి మొబైల్ అన్న కాంటీన్ వద్ద బోనం వెంకటరమణ జన్మదినం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని జలవనరుల శాఖ మంత్రి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహించి ఆదర్శంగా నిలిచారని కొనియాడుతూ, అన్నదానంలో భాగస్వాములైన శేషారత్నం, శశి హైమవతి, శ్రీరామ్‌లకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు వెల్లడించారు.