గణేష్ నిమజ్జనం వేళ అర్ధరాత్రి వరకు మెట్రో సేవలున్నట్లు అధికారుల ప్రకటన

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Hyderabad

భాగ్యనగరంలో జరుగుతున్న వినాయక నిమజ్జన ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు ప్రయాణికులకు తీపి కబురు అందించారు. సెప్టెంబర్ 25న నిమజ్జనం వేడుకల రద్దీని దృష్టిలో ఉంచుకుని అర్ధరాత్రి 1:00 గంట వరకు మెట్రో సర్వీసులు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. భక్తుల సౌకర్యార్థం ఖైరతాబాద్, లక్డీకాపూల్ స్టేషన్లలో అదనపు భద్రత, టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.