బాలికలు వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలి
రిపోర్టర్: కిరణ్
స్థలం: ఖమ్మం
ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం వసతి గృహంలో భేటీ బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా కిశోర బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. డిప్యూటీ కలెక్టర్ అపర్ణ, డీడబ్ల్యూఓ ప్రమీల పాల్గొని బాలికలకు రుతుస్రావ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య సూత్రాలు వివరించారు. రక్తహీనత నివారణకు పౌష్టికాహారం తీసుకోవాలని, విద్యకు దూరం కావద్దని సూచించారు.