మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేడు నేరెళ్ల శారద బాధ్యతలు

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా సీనియర్ నాయకురాలు నేరెళ్ల శారద నేడు అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సికింద్రాబాద్లోని బుద్ధ భవన్లో ఉన్న కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. మహిళల హక్కులు, రక్షణ కోసం ఆమె ఈ బాధ్యతలు చేపడుతుండగా, ఈ వేడుకకు పలువురు ప్రముఖులు, మహిళా సంఘాల ప్రతినిధులు భారీగా హాజరుకానున్నారు.