నర్సంపేట కొత్తగూడ రహదారి గుంతలమయమై వాహనదారులకు నరకప్రాయంగా మారిన వైనం
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
నర్సంపేట నుంచి కొత్తగూడ వెళ్లే రహదారి పూర్తిగా ధ్వంసమై వాహనదారులకు ప్రయాణం నరకప్రాయంగా మారింది. రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడటంతో బస్సుల్లో ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు కుదుపులకు గురవుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతూ తక్షణమే స్పందించి రోడ్డును బాగుచేయాలని కోరుతున్నారు.