పేదల సంక్షేమమే ధ్యేయంగా అందిన సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సాయం
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ పుర పరిధిలోని లింగోజిగూడెంకు చెందిన ఇద్దరు లబ్ధిదారులకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. పిల్ల లీలమ్మకు రూ.18 వేలు, సయ్యద్ అసద్‌కు రూ.27 వేల విలువైన చెక్కులను మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్‌గౌడ్‌తో పాటు కాంగ్రెస్ నేతలు అందజేశారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వం అండగా నిలుస్తోందని, ఈ సాయం పేద కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తుందని నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.