'26 మొబైల్ ఫోరెన్సిక్ వాహనాలు ప్రారంభం': AP Police వెల్లడి
రిపోర్టర్: సునీల్
స్థలం: Mangalagiri
రాష్ట్రంలో ఫోరెన్సిక్ సేవలను మరింత పటిష్టం చేసేందుకు AP Police కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మంగళగిరిలోని ఆరవ ఏపీఎస్పీ బెటాలియన్ గ్రౌండ్స్‌లో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా 26 మొబైల్ ఫోరెన్సిక్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిధిలో నేర పరిశోధన వేగవంతం చేయడానికి, సాక్ష్యాల సేకరణను మరింత ఆధునీకరించడానికి ఈ అత్యాధునిక వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయని AP Police స్పష్టం చేసింది.