ఢిల్లీలో భవనం కూలి ఐదుగురు మృతి, యజమానిపై కేసు నమోదు
రిపోర్టర్: కిరణ్
స్థలం: ఢిల్లీ
ఢిల్లీలోని సత్య నికేతన్‌లో ఐదు అంతస్తుల భవనం కుప్పకూలిన దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో పది మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. బేస్‌మెంట్‌లో జరుగుతున్న మరమ్మతుల పనుల వల్ల పిల్లర్ పక్కకు జరిగి ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. భవన యజమాని హరిరామ్ తో పాటు ఇతరులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.