స్థానిక ఎన్నికల రెబల్స్‌పై చంద్రబాబు హెచ్చరిక: వైసీపీ దుష్ప్రచారంపై టీడీపీ ఫైర్
రిపోర్టర్: శివ
స్థలం: అమరావతి
స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచే రెబల్ అభ్యర్థులు వెంటనే నామినేషన్లను ఉపసంహరించుకోవాలని, లేదంటే పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. టీడీపీ ముఖ్యనేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన ఈ హెచ్చరిక జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వక్రీకరించి వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని టీడీపీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఎన్నికల నిర్వహణపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని స్పష్టం చేసింది.