కోవూరులో ఘనంగా గురుపూజోత్సవం: ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సత్కారం

రిపోర్టర్: హరి స్థలం: నెల్లూరు

కోవూరులో మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంఈఓ వై. చెంచు లక్ష్మమ్మ మాట్లాడుతూ, విద్యార్థుల్లో నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా విద్యారంగంలో విశేష సేవలందించిన మండల ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి పురస్కారాలను అందజేశారు.