నీటి సంక్షోభాన్ని తరిమికొట్టేందుకు రాజాపేట గ్రామాల్లో ఉవ్వెత్తున ఉద్యమించిన జనం

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలంలో ఎల్ ని నో ప్రభావంతో ఏర్పడనున్న నీటి సమస్యను అధిగమించేందుకు గ్రామస్తులు సామూహిక ప్రతిజ్ఞ చేశారు. బొందుగుల, లక్ష్మక్కపళ్లి, సోమవారం గ్రామాలలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించి నీటి పరిరక్షణ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు అలాగే పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.