జనసేనలోకి పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి: పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అమరావతి

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ప్రముఖ పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి పార్టీలో చేరారని వర్గాలు వెల్లడించాయి. బుధవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఆయనకు పవన్ కల్యాణ్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. నరసరావుపేట ప్రాంతానికి చెందిన దిలీప్ చక్రవర్తి గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున సత్తెనపల్లి నుంచి పోటీ చేశారు. ఈ సందర్భంగా ఆయన తాను రచించిన పుస్తకాన్ని పవన్ కల్యాణ్కు అందజేసి, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై ప్రత్యేకంగా చర్చించారు.