అనంతపురంలో ప్రశాంతంగా ముగిసిన వినాయక చవితి నిమజ్జనోత్సవం
రిపోర్టర్: గోపి
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లాలో వినాయక నిమజ్జన కార్యక్రమం అత్యంత ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది. ఈ వేడుకలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా పోలీసు సిబ్బందికి అధికారులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే నిమజ్జనోత్సవానికి సంపూర్ణంగా సహకరించిన ఉత్సవ కమిటీలు, వాలంటీర్లు, వివిధ శాఖల సిబ్బంది, మీడియా ప్రతినిధులు మరియు ప్రజలందరికీ పోలీసులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.