నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట భద్రత: శ్రీకాకుళం ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల నామినేషన్ల దాఖలు సందర్భంగా అభ్యర్థులకు ఎలాంటి భయాందోళనలు లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు శ్రీకాకుళం పోలీస్ శాఖ వెల్లడించింది. అభ్యర్థులు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో నామినేషన్లు దాఖలు చేసుకునేలా అన్ని ముందస్తు చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా క్షేత్రస్థాయిలో పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశామని ఆయన పేర్కొన్నారు.