మహనీయుడు విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో నవభారత నిర్మాణానికి పునాదులు వేయాలి

రిపోర్టర్: Bobbili GANESH స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని స్థానిక శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాంకేతికత లేని కాలంలోనే ఇంజనీరింగ్ విభాగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి జలాశయాల నిర్మాణం చేపట్టిన ఘనత విశ్వేశ్వరయ్యకే దక్కుతుందన్నారు. ప్రతి ఒక్క ఇంజనీర్ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని అత్యున్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షక ఇంజనీరు సత్యనారాయణ రెడ్డి, కార్యనిర్వాహక ఇంజనీరు రాధారాణి, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ రౌతు రామ్మూర్తి మరియు పలువురు అధికారులు పాల్గొన్నారు.