అమరావతిపై పార్లమెంట్ చట్టబద్ధతతో వ్యాజ్యాలు నిరర్థకమని హైకోర్టు స్పష్టీకరణ

రిపోర్టర్: సతీష్ స్థలం: Amaravati

రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో మూడు రాజధానుల ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు నిరర్థకమయ్యాయని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ నైనాల జయసూర్య, జస్టిస్ బీఎస్ భానుమతిల ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టులో అప్పీళ్లు విచారణకు వచ్చే అవకాశం ఉన్నందున ఈ వ్యాజ్యాలపై విచారణను నవంబర్ ఇరవయ్యవ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది.