గణేష్ నిమజ్జనాలపై హైడ్రా ఆంక్షల ప్రచారంలో వాస్తవం లేదు

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలపై హైడ్రా తీవ్ర ఆంక్షలు విధించిందన్న సోషల్ మీడియా ప్రచారాన్ని కమిషనర్ ఏవీ రంగనాథ్ ఖండించారు. కేంద్రం రక్షిత ప్రాంతాలుగా ప్రకటించిన అమీన్‌పూర్, కాప్రా వంటి కొన్ని చెరువుల్లో మినహా మిగిలిన అన్ని చోట్ల నిమజ్జనాలు యథావిధిగా సాగుతాయని స్పష్టం చేశారు. తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని ఉత్సవ కమిటీలకు విజ్ఞప్తి చేశారు.