ఎంపీఎస్సీ అభ్యర్థుల ఆందోళనకు కాక్రోచ్ జనతా పార్టీ మద్దతు
రిపోర్టర్: విజయ్
స్థలం: మహారాష్ట్ర
మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలపై ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే మద్దతు తెలిపారు. ఎంపీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శి రాజీనామా చేయాలని సెప్టెంబర్ 24 వరకు గడువు విధించారు. డిమాండ్లు నెరవేరకపోతే రాష్ట్రవ్యాప్త పర్యటన చేపట్టి ఉద్యటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అభ్యర్థుల పోరాటంలో చివరి వరకు నిలబడతామని స్పష్టం చేశారు.