ఫ్లై దుబాయ్ పైలట్ సాహసాన్ని అభినందించిన ప్రధాని మోదీ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తూర్పు గోదావరి

ఫ్లై దుబాయ్ విమాన పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాల్లో మాట్లాడారు. విమానంలో సహ-పైలట్ దాడి చేసినప్పటికీ తీవ్ర గాయాలతో ఆయన చూపిన అసాధారణ ధైర్యసాహసాలను ప్రధాని ప్రశంసించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వెల్లడించారు. ఈ క్లిష్ట సమయంలో స్మిత్ మచ్చార్ ప్రదర్శించిన అపారమైన ధైర్యం, అప్రమత్తతతో కూడిన సమయస్ఫూర్తిని ఆమె ప్రత్యేకంగా కొనియాడారు.