రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
రిపోర్టర్: హరి
స్థలం: విజయనగరం
విశాఖ నుంచి స్వగ్రామానికి వచ్చి తిరిగి వెళ్తుండగా కొత్తవలస మండలం నిమ్మలపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ అదుపుతప్పి వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో చరణ్‌తేజ అక్కడికక్కడే మృతి చెందగా, రాజ్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. పండగ పూట స్వగ్రామానికి వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.