పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు: రక్తదాన శిబిరంలో వంద యూనిట్ల రక్తం సేకరణ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హన్మకొండ

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మరియు రెడ్క్రాస్ సంస్థ సహకారంతో భీమారంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో మొత్తం నూటఒక యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు Warangal Police వెల్లడించారు. ఈ ప్రత్యేక శిబిరంలో పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత స్వయంగా రక్తదానం చేసి సిబ్బందిలో స్ఫూర్తి నింపారని, అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం ఎంతో మంది ప్రాణాలను కాపాడటంలో కీలకమవుతుందని అధికారులు పేర్కొన్నారు.