మట్టి ప్రతిమను చేసి పర్యావరణ భక్తి చాటిన చిన్నారి

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలం పారుపల్లి ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న మాడిశెట్టి సంగీతలక్ష్మి ఇంట్లో పూజించుకునేందుకు సొంతంగా మట్టి వినాయకుని తయారు చేసి తన భక్తిని, నైపుణ్యాన్ని చాటుకుంది. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఈ చిన్నారి ఎంతో అందంగా మట్టి ప్రతిమను రూపొందించింది. ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అలాగే గ్రామస్తులు విద్యార్థినిని ప్రత్యేకంగా అభినందించారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుల పూజ ఉత్తమమని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు.