కొత్తపల్లిలో లబ్ధిదారురాలికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
రిపోర్టర్: k. siva prasad
స్థలం: చిట్వేల్
పెనగలూరు మండలం కొత్తపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మీగడ సైలజకు యాభై వేల నాలుగు వందల అరபై రెండు రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి లబ్ధిదారురాలి నివాసానికి వెళ్లి స్వయంగా ఈ ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎన్డీఏ కూటమి నేతలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.