ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం: పులివెందులలో ఇరువర్గాల ఘర్షణ

రిపోర్టర్: శివ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మండల మరియు జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల పోలింగ్ ప్రారంభమైందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 582 జడ్పీటీసి మరియు 7,767 ఎంపీటీసి స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పోలింగ్ కోసం అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పులివెందుల మండలం ఆర్.తుమ్మలపల్లిలో టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలింగ్ సజావుగా సాగేందుకు పోలీసు బలగాలను మోహరించినట్లు అధికారులు స్పష్టం చేశారు.