'ప్రైవేటు పాఠశాలలతో పోటీపడాలి': విద్యార్థుల హాజరుపై మంత్రి లోకేశ్ అసంతృప్తి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: నెల్లూరు
నెల్లూరు నగరంలో రూ.కోట్లతో నిర్మించిన డీఎస్‌ఆర్, ఆర్‌ఎస్‌ఆర్ స్కూళ్ల ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ పాల్గొని తరగతి గదులను, విద్యార్థుల బోధనా నైపుణ్యాలను పరిశీలించారు. అయితే స్కూళ్లల్లో విద్యార్థుల హాజరుశాతం తక్కువగా ఉండటంపై హెచ్‌ఎంలను ప్రశ్నిస్తూ ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలలతో పోటీపడేలా ఎన్‌రోల్‌మెంట్ పెంచుకోవాలని, లెర్నింగ్ అవుట్ కమ్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హిమాన్షుశుక్లా తదితరులు పాల్గొన్నారు.