రాయలసీమలో వ్యవసాయ పాఠశాల ఏర్పాటుపై అనంత్ అంబానీకి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు
రిపోర్టర్: రాము
స్థలం: చిత్తూరు
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన అనంత్ అంబానీకి చంద్రబాబు నాయుడు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రైతాంగాన్ని ఆర్థికంగా శక్తిమంతం చేయడంతో పాటు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఆయన చూపుతున్న చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతాన్ని గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా మార్చడంలో అనంత్ అంబానీ అంకితభావం ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా వెల్లడించారు.