కందుకూరులో వైన్స్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలోని జై భవాని వైన్స్‌లో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో సుమారు కోటీ ఇరవై లక్షల రూపాయల విలువైన మద్యం, అరవై వేల నగదు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఆలస్యంగా అందడంతో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడి భారీ నష్టం వాటిల్లింది. ప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.