ది ప్యారడైజ్ ప్రీమియర్ షోపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన

రిపోర్టర్: అశోక్ స్థలం: Hyderabad

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని థియేటర్‌లో ది ప్యారడైజ్ సినిమా ప్రీమియర్ షో ప్రదర్శన కోసం హీరో నాని చేసిన విజ్ఞప్తిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్‌ వేదికగా సానుకూలంగా స్పందించారు. భద్రతా మార్గదర్శకాలను పాటించాలని సూచిస్తూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారిక దరఖాస్తు చేసుకోవాలని నానికి సూచించారు. గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకుని పోలీసుల సూచనల మేరకు నడుచుకుంటామని నాని తెలిపారు.