తిరుపతిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 23 మందికి జరిమానా!

రిపోర్టర్: RAVI BABU స్థలం: వెదురుకుప్పం

రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా తిరుపతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 23 మందిని గుర్తించి కేసులు నమోదు చేశారు.

కోర్టు విచారణ అనంతరం ఆ 23 మందికి ఒక్కొక్కరికి పది వేల రూపాయల చొప్పున జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.