హస్తకళల పరిరక్షణకు త్వరితగతిన చర్యలు చేపట్టాలి: పవన్‌కల్యాణ్‌

రిపోర్టర్: రమేష్ స్థలం: అమరావతి

సంప్రదాయ హస్తకళల వారసత్వ పరిరక్షణతో పాటు కళాకారులకు చేయూత అందించే కార్యక్రమాలను వేగవంతం చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆదేశించారు. మంగళవారం వర్చువల్‌గా నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. కామన్‌ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు స్థల సేకరణ, నిర్మాణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్లు, లేపాక్షి అధికారులను ఆదేశించారు. గిరిజన చిత్రకారులు మరియు వివిధ ప్రాంతాల హస్తకళాకారుల కోసం సామాజిక భవనాల పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు.