నర్సంపేటలో ఆగని కరెంటు కోతలు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం

రిపోర్టర్: Rajashekar స్థలం: నర్సంపేట

నర్సంపేట పట్టణంలో గత కొన్ని రోజులుగా విద్యుత్ కోతలు తీవ్రమయ్యాయి. రోజులో పది సార్లు అకస్మాత్తుగా సరఫరా నిలిచిపోతుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధులు నిద్రలేని రాత్రులు గడుపుతుండగా, విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతోంది.

విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతుల పేరుతో కాలయాపన చేస్తున్నారని, వెంటనే సమస్యను పరిష్కరించి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.