తుఫాన్ సహాయక చర్యలపై ఐజీపీ సమీక్ష: ఉధృతంగా రంగంలోకి ఎస్పీడీఆర్ఎఫ్ బృందాలు

రిపోర్టర్: నరేష్ స్థలం: Andhra Pradesh

అర్నబ్ తుఫాన్ సహాయక చర్యలను పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలో ఐజీపీ సీహెచ్ శ్రీకాంత్ సమీక్షించారు. తుఫాన్ ప్రభావంతో రహదారులపై కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగిస్తూ రాకపోకలను పునరుద్ధరించేందుకు ఏపీఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయని ఆంధ్రాప్రదేశ్ పోలీస్ వెల్లడించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ సహాయక చర్యలను వేగవంతంగా కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.