ట్రోల్స్‌పై స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన హీరో నాని
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
నేచురల్ స్టార్ నాని నటించిన ది ప్యారడైజ్ సినిమా విజయంపై మరియు సోషల్ మీడియా ట్రోల్స్‌పై హీరో నాని స్పందించినట్లు తెలిపారు. ప్రేక్షకుకులు చూపించిన ప్రేమాభిమానాలతో పాటు హిలేరియస్ ట్రోల్స్‌ను కూడా తాను ఎంతో ఆస్వాదించినట్లు ఆయన పేర్కొన్నారు. క్రిటిక్స్ ఎత్తిచూపిన తప్పుల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని, ఈ సినిమాను ప్రేక్షకులు తమ సొంత చిత్రంగా ఓన్ చేసుకున్న తీరు తన మనసును తాకిందని నాని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.