షాకింగ్ ఘటన: పెళ్లి సంబరాల్ లో కాల్పులు జరిపి ఐదేళ్ల బాలుడి హత్య

రిపోర్టర్: కృష్ణ స్థలం: సుల్తాన్ పూర్

ఆదివారం సాయంత్రం వివాహ వేడుకలో జరిగిన సంబరాల కాల్పులలో బుల్లెట్ తగిలి ఐదేళ్ల బాలుడు మరణించినట్లు సర్కిల్ ఆఫీసర్ వినయ్ గౌతమ్ తెలిపారు. కడిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుతెహరి బాంకే గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఊరేగింపునకు ముందు బాలుడి బంధువు అజయ్ గాల్లోకి కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన అర్ష్ పటేల్ అనే బాలుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడని, నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు.