నెలాఖరులోగా చెరువుల పునరుజ్జీవన పనులు పూర్తి చేయండి: పవన్ కల్యాణ్

రిపోర్టర్: మహేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన కింద చేపట్టిన 105 చెరువుల పునరుజ్జీవన పనుల్లో ఇప్పటికే 26 పూర్తయ్యాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. మిగిలిన పనులను నాణ్యతతో నెలాఖరులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. చెరువుల అభివృద్ధి ద్వారా భూగర్భ జలాలు పెరగడమే కాకుండా, వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ జిమ్‌లతో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు.