వై.కోట గ్రంథాలయంలో ఘనంగా గురజాడ అప్పారావు జయంతి
రిపోర్టర్: k. siva prasad
స్థలం: చిట్వేల్
వై.కోట గ్రంథాలయంలో గురజాడ అప్పారావు జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ అధికారి ఎం. సుధాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయురాలు తులసి మాట్లాడుతూ సమాజ సంస్కరణకు గురజాడ చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాకవి ఆశయాలను స్మరించుకున్నారు.