యూఏఈ వెళ్లే భారతీయులకు కీలక హెచ్చరిక: తప్పనిసరిగా వైద్య బీమా తీసుకోవాలని సూచన
రిపోర్టర్: వెంకట్
స్థలం: Dubai
దుబాయ్‌లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం మంగళవారం ఒక ముఖ్యమైన ప్రయాణ మార్గదర్శకాలను జారీ చేసింది. యూఏఈకి పర్యటన నిమిత్తం వెళ్లే భారతీయ పౌరులు ప్రయాణానికి ముందే తగిన వైద్య బీమాను తీసుకోవాలని స్పష్టం చేసింది. అనుకోని ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, భారీ వైద్య ఖర్చుల భారం నుంచి రక్షణ పొందేందుకు ఈ ఇన్సూరెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు వెల్లడించారు. అలాగే నగదు రహిత సదుపాయాలు మరియు స్వదేశానికి వైద్య రవాణా ఖర్చులు కూడా బీమా పరిధిలో ఉండేలా చూసుకోవాలని హెచ్చరించారు.