కాంగ్రెస్ను వీడి భారీగా బీఆర్ఎస్లో చేరిన నేతలు

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు రెండు వేల మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.