చిన్నభూంపల్లిలో వైఎస్సార్సీపీ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహణ
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: కౌతాళం
కర్నూలు జిల్లా కోసిగి మండలం చిన్నభూంపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పార్టీ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, నాయకులు వై.ప్రదీప్ రెడ్డి, వై.ధరణిరెడ్డి ఆదేశాల మేరకు మండల ఇంచార్జి మురళీమోహన్ రెడ్డి కార్డులను అందజేశారు. ఈ కార్డు పార్టీ కార్యకర్తల గుర్తింపు, గౌరవానికి ప్రతీక అని, ఆపదలో ఉన్న ప్రతి కార్యకర్తకు పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని నాయకులు స్పష్టం చేశారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.